breaking news
Nia Sharma
-
కోటిన్నర విలువైన కారు కొన్న ప్రముఖ బుల్లితెర నటి
ప్రముఖ బుల్లితెర నటి నియా శర్మ ఖరీదైన కారు కొనుగోలు చేసింది. తాజాగా మెర్సిడెస్-బెంజ్‌ను తన సొంతం చేసుకుంది. ఈ లగ్జరీ కారు విలువ దాదాపు రూ. 1.50 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. తన కొత్త కారుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ కారు కొనడంతో తన డబ్బు అంతా అయిపోయిందని.. ఇప్పుడు ఈఎంఐ మాత్రమే అందుబాటులో ఉందని నియా శర్మ ఫన్నీగా పోస్ట్ చేసింది.కాగా.. ఢిల్లీకి చెందిన నియా శర్మ పదేళ్లకు పైగా బుల్లితెర నటిగా రాణిస్తోంది. 2010లో కాళీ - ఏక్ అగ్నిపరీక్ష సీరియల్‌తో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత ఏక్ హజారోన్ మే మేరీ బెహ్నా హై షో సీరియల్‌తో ఫేమస్ అయింది. అంతేకాకుండా జమై రాజా, ఇష్క్ మే మార్జావాన్, నాగిన్- 4, సుహాగన్ చుడైల్ లాంటి షోలలో కనిపించింది. ఆమె చివరిసారిగా రియాలిటీ షో లాఫర్ చెఫ్స్ సీజన్- 2లో మెరిసింది. అయితే నియా బిగ్ బాస్‌లో పాల్గొంటుందని గతంలో వార్తలొచ్చాయి. కానీ తాను బిగ్‌బాస్‌లో పాల్గొనడం లేదని సోషల్ మీడియా ద్వారా నియా స్పష్టం చేసింది. ఆమె ప్రస్తుతం ఎలాంటి సీరియల్‌ను ప్రకటించలేదు. View this post on Instagram A post shared by Nia Sharma (@niasharma90) -
నటి బోల్ట్ అవుట్‌ఫిట్... ఉర్ఫీ జావెద్‌ను ఫాలో అవుతున్నారుగా!
బాలీవుడ్ బుల్లితెర భామ నియా శర్మ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. ఆమె ఏక్ హజారోన్ మే మేరీ బెహనా హై, జమై రాజా, ఇష్క్ మే మార్జవాన్, నాగిన్ -4 సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఆమెకు ఇన్‌స్టాలో దాదాపు 8 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఎక్కడికెళ్లినా ప్రతిసారి ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఈ ముద్దు గుమ్మ షేర్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: లేటు వయసులో నటుడి పెళ్లి.. మళ్లీ హనీమూన్ కూడానా?) తాజాగా ఆమె తన స్నేహితుడి పుట్టినరోజు పార్టీలో నియా శర్మ బ్యాక్‌సైడ్ ఎలాంటి దుస్తులు లేకుండా కనిపించి అభిమానులకు షాకిచ్చింది. అయితే ఆ వీడియోలో నియా శర్మ పూర్తిగా బ్యాక్ లెస్‌గా కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ రాస్తూ ఉర్ఫీ జావెద్‌ను ఆదర్శంగా తీసుకున్నారా? అంటూ రాసుకొచ్చాడు. ఆమెకు కనీసం దుస్తులు వేసుకోనేందుకు కూడా టైం లేదా అంటూ రాశారు. అంతేకాకుండా మరో నెటిజన్ రాస్తూ ఏకంగా దుపట్టానే డ్రెస్‌గా మార్చిసేంది అంటూ కామెంట్ చేశాడు. మరికొందరేమో చీప్ డ్రెస్సింగ్ అంటూ ట్రోల్స్ చేశారు. కాగా.. 'ఏక్ హజారోన్ మే మేరీ బెహనా హై' షోతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆమె రవి దూబేతో కలిసి 'జమై రాజా' అనే ప్రముఖ షోలో కనిపించింది. నియా శర్మ బాక్స్ క్రికెట్ లీగ్, ఖత్రోన్ కే ఖిలాడీ -8, బిగ్ బాస్ ఓటీటీ లాంటి రియాలిటీ షోలలో పాల్గొంది. (ఇది చదవండి: 14 సార్లు ప్రయత్నించా.. కానీ స్టార్ హీరో వల్లే తల్లినయ్యా: బుల్లితెర నటి) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)


