‘గూగుల్‌’ను నమ్మి గోతిలోకి..!!! | Car falls into pothole after trusting Google Maps | Sakshi
Sakshi News home page

‘గూగుల్‌’ను నమ్మి గోతిలోకి..!!!

Jul 20 2026 5:41 AM | Updated on Jul 20 2026 5:41 AM

Car falls into pothole after trusting Google Maps

తిరుపతి జిల్లా వెంకటగిరి నుంచి డక్కిలి వైపు వెళుతున్న ఓ కారు గూగుల్‌ మ్యాప్‌ను నమ్ముకుని గోతిలో బోల్తా పడింది. ఏర్పేడు–పెంచలకోన జాతీయ రహదారిలోని లింగసముద్రం వద్ద బ్రిడ్జి నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు డైవర్షన్‌ చేశారు.

అయితే గూగుల్‌ జీపీఎస్‌ ఆధారంగా ఓ వ్యక్తి కారు డ్రైవ్‌ చేసుకుంటూ రావడంతో మ్యాప్‌ చూపించిన విధంగా నేరుగా వెళ్లి వంతెన కోసం తవ్విన గోతిలో కారు పడిపోయింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌ గాయపడ్డాడు. రోడ్డు డైవర్షన్‌ చేసినట్టుగా కనీసం సూచిక బోర్డును సైతం అధికారులు ఏర్పాటుచేయకపోవడం గమనార్హం.       – డక్కిలి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement