
సాక్షి, మెదక్: జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. వరద ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. హవేలి ఘన్‌పూర్ మండలం నక్కవాగులో ఘటన జరిగింది. భారీ వర్షాలు కారణంగా నక్కవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వద్దని స్థానికులు వారించినా పట్టించుకోని కారు డ్రైవర్.. అత్యుత్సాహంతో వరద ప్రవాహంలో కారు నడిపారు. దీంతో వాగులో కారు కొట్టుకుపోయింది. కారులో ఉన్నవారి వివరాల కోసం అధికారులు ఆరా తీస్తున్నారు.
కాగా, హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా జిల్లాలోని ధూప్‌సింగ్ తండా జలమయమైంది. తండాను వరద నీరు ముంచెత్తడంతో ఇళ్లలోకి నీరు చేరుకుంది. జల దిగ్భంధంలో తండా ఉండటంతో తమ కాపాడాలంటూ స్థానికులు బిల్డింగ్‌పైకి ఆర్తనాదాలు చేస్తున్నారు.
మరోవైపు.. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రాబోయే 2 గంటల్లో 8 జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని తెలిపింది.