బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు ఆగడం లేదు. అక్కడి హిందువులను చంపడం సర్వసాధారణమైంది. తాజాగా మరోసారి అక్కడ హిందూ యువకుడిపై దాడి జరిగింది. పెట్రోల్ బంక్‌లో డీజిల్ కొట్టించిన వ్యక్తిని డబ్బులు అడిగినందుకు ఆ వెహికల్ యజమాని ఆగ్రహాంతో యువకునిపై కారు ఎక్కించాడు. ఈ ఘటన అక్కడి మతఛాందసవాదుల రాక్షసత్వానికి పరాకాష్ఠగా నిలుస్తోంది.
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఘటనలను భారత్ ఎంతగా ఖండించిన అక్కడి మైనార్టీలపై దాడులు ఆగడం లేదు. ఇటీవల బ్రిటన్ పార్లమెంటులో సైతం మైనారిటీలపై దాడుల అంశం ప్రస్థావనకు వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా అక్కడ మరోసారి హిందూ యువకునిపై దాడి జరిగింది.
డైలీ స్టార్ కథనం ప్రకారం.. రిపోన్ సోహ అనే హిందూ యువకుడు అక్కడి స్థానిక పెట్రోల్‌బంక్‌లో పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం అక్కడికి ఎస్‌యూవీ వాహనంలో వచ్చిన ఓ వ్యక్తి రూ. 3,710 డిజీల్ వాహనంలో కొట్టించాడు. దీంతో అతనిని డబ్బులు చెల్లించాలని ఆ అడిగాడు. దీనికి అతను నిరాకరించడంతో పెట్రోల్ బంక్ సిబ్బంది సోహ వాహనం ఎదుట నిలుచున్నాడు. దీంతో ఆగ్రహం చెందిన ఆ వ్యక్తి అతనిపైనుంచి వాహనాన్ని నడిపాడు. దీంతో రిపోన్ సోహా అక్కడికక్కడే మృతిచెందాడు.
ఈ వివరాలు తెలుసుకున్న పోలీసులు వాహానాన్ని సీజ్ చేసి నిందితులను అరెస్టు చేశారు. కాగా ఆవాహనం NCP పార్టీకి చెందిన మాజీ నేత అబుల్ హషీంకు చెందినదిగా గుర్తించిట్లు పోలీసులు తెలిపారు.బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై జరుగుతున్న దాడులపై అక్కడి మానవహక్కుల సంఘం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. వచ్చే సాధారణ ఎన్నికల్లో మైనార్టీలు తమకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోకుండా భయాందోళనలకు గురిచేసేందుకే అక్కడి అల్లరి మూకలు ఈ దాడులు జరుపుతున్నట్లు హుమన్‌రైట్స్ కమిషన్ ఆరోపిస్తుంది.
బంగ్లాదేశ్ జనాభాలో హిందువులు 7.95 శాతం కోటి 14 లక్షల మంది ఉన్నారు. కాగా వచ్చేనెలలో బంగ్లాదేశ్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి.


