
తిరుపతి జిల్లా: తిరుమలలో సీఎం చంద్రబాబు ఫొటోతో కూడిన ఓ కారు మంగళవారం హల్‌చల్ చేసింది. తిరుమలకు పార్టీ రంగులు, నాయకుల ఫొటోలతో కూడిన వాహనాలకు అనుమతి లేని విషయం తెలిసిందే. మంగళవారం ఏపీ 39 ఆర్‌ఎం 3999 నంబర్‌గల కారు..వెనుక వైపు సీఎం చంద్రబాబు ఫొటో కనిపించింది. దీంతో పలువురు భక్తులు అధికార పార్టీ నాయకుల బొమ్మలు వాహనాలపై ఉంటే తిరుమలకు అనుమతిస్తారా? అంటూప్రశ్నించారు. ఇప్పటికైనా అలిపిరి చెక్‌పోస్ట్ వద్ద టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తనిఖీలను క్షుణ్ణంగా నిర్వహించాలని భక్తులు కోరారు.