మేడం నా క్యాబ్‌లో బీరు తాగొద్దు.. | Cab driver in Bengaluru for mistaking Kombucha for beer and misbehaving with woman | Sakshi
Sakshi News home page

మేడం నా క్యాబ్‌లో బీరు తాగొద్దు..

Jun 28 2026 8:18 AM | Updated on Jun 28 2026 9:13 AM

Cab driver in Bengaluru for mistaking Kombucha for beer and misbehaving with woman

బెంగళూరు: క్యాబ్‌లో ప్రయాణికురాలు జ్యూస్‌ తాగుతుండగా, బీరు తాగుతున్నావంటూ డ్రైవరు ఆమెతో గొడవకు దిగాడు. ఈ ఘటన బెంగళూరు అశోక్‌నగర పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. ఈ నెల 21న రాత్రి మహిళ కోరమంగళ రెస్టారెంట్‌ నుంచి తన ఇంటికి ఉబర్‌ కారును బుక్‌ చేసుకొంది. కారు ఎక్కగానే జ్యూస్‌ బాటిల్‌ తీసి తాగుతుండగా, కారులో బీరు తాగవద్దంటూ డ్రైవరు ఆమెను దబాయించాడు. ఇది బీరు కాదు, జ్యూస్‌ అని చెప్పినా అతడు వినిపించుకోలేదు. 

కారులో నుంచి బయటకు తోసేందుకు ప్రయత్నించాడని, అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె పోలీసులకు వచ్చిన ఫిర్యాదులో తెలిపింది. డ్రైవర్‌ దౌర్జన్యంగా మాట్లాడటంతో మహిళ కారును, నిలిపి తన ట్రిప్‌ను రద్దు చేయాలని పదేపదే కోరింది. అయినా కారును నిలపకపోవడంతో అతికష్టం మీద డోర్‌ను తెరిచి కిందకు దూకేసింది. డ్రైవర్‌ కారుతో వెళ్లిపోయాడని తెలిపింది. పోలీసులు డ్రైవరు కోసం గాలింపు చేపట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement