
ముంబై: ‘అతి సర్వత్ర వర్జయేత్’ అంటే ఏ విషయంలోను అతిగా ఉండకుడదు అని అర్ధం. అందుకే అతి చేయడం కన్నా మితంగా ఉండడం మంచిది అంటారు పెద్దలు. లేదంటే ఇదిగో ఇలా ప్రాణాల్ని రిస్కులో పెట్టుకోవాల్సి ఉంటుంది. అసలేం జరిగిందంటే?
మహారాష్ట్రలోని పటన్–సదవఘాపూర్ రోడ్ టేబుల్ పాయింట్ ప్రముఖ పర్యాటక ప్రాంతం. చుట్టూ లోయలు ఉండే సమతల భూమి, వర్షాకాలంలో నీరు పైకి ఎగిరేలా కనిపించే వాటర్ ఫాల్ ప్రత్యేక ఆకర్షణతో ప్రకృతి ప్రేమికుల్ని పరవశించేలా చేస్తోంది. వర్షాకాలంలో ఈ ప్రాంతాన్ని వీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకలు నిత్యం తరలివస్తుంటారు.
అలా బుధవారం సాయంత్రం రౌండ్ టేబుల్ పాయింట్ చూసేందుకు వచ్చిన పర్యాటకుల్లో పూణే గుజారావాడి ప్రాంతానికి చెందిన సాహిల్ అనిల్ జాధవ్ ఉన్నాడు. సాహిల్ తన స్నేహితులతో కలిసి కారులో ఆ ప్రాంతానికి వచ్చాడు. కారులో ఆ ప్రాంతం మొత్తం కలియ తిరిగాడు. ఆ సమయంలో ఎటు చూసినా జనం ఉండడంతో సాహిల్ అతి చేశాడు. ప్రాణాలు మీదకు తెచ్చుకున్నాడు. లోయ ప్రాంతం కావడంతో కారుతో స్టంట్లు వేశాడు.
సరిగ్గా అదే సమయంలో కారుపై పట్టుకోల్పోయాడు. తన కారుతో పాటు 300 అడుగల లోయలో పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక లోయలో పడిన సాహిల్‌ను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రదేశం నిత్యం ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. రక్షణ గోడలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికులను అలరిస్తున్నప్పటికీ భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలని స్థానికులు టూరిస్టులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
महाराष्ट्र के कराड का वीडियो है..
स्टंटबाजी के चक्कर में 300 फीट नीचे गिरे, गंभीर रूप से घायल है ड्राइवर जी..#Maharashtra pic.twitter.com/CUKABEzorN— Vivek Gupta (@imvivekgupta) July 11, 2025