
కడప రూరల్ : స్నేహితుడే కదా అని కారు ఇచ్చాను...అతను తన కారును ఒక కానిస్టేబుల్‌కు కుదువ పెట్టుకున్నాడని బద్వేలు నియోజకవర్గం గోపవరానికి చెందిన సిద్దయ్య తెలిపారు. సోమవారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్ క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తన బతుకుతెరువు కోసం 2023లో టయోటా కారును కొనుగోలు చేసి ఉపాధి పొందుతున్నట్లు తెలిపాడు. కొన్ని నెలల క్రితం బద్వేల్‌కు చెందిన తన మిత్రుడు వచ్చి ఒక వారం కారు కావాలని అడిగితే ఇచ్చానని పేర్కొన్నాడు. వారం దాటినా అతను తన కారును ఇవ్వకపోవడంతో విచారించగా తన మిత్రుడు కారును ఒక కానిస్టేబుల్‌కు కుదువ పెట్టినట్లు తెలిసిందన్నాడు. న్యాయం కోసం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయగా, బద్వేల్ పోలీస్ స్టేషన్‌కు రెఫర్ చేశారని తెలిపాడు. అయినా కూడా తనకు న్యాయం జరగలేదని ఆరోపించాడు. అధికారులు తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరాడు.