తిరుపతి: కారులో చెలరేగిన మంటలు.. దంపతులు మృతి | 2 Died And 2 Injured After Fire Breaks Out In Car In Tirupati District, More Details | Sakshi
Sakshi News home page

తిరుపతి: కారులో చెలరేగిన మంటలు.. దంపతులు మృతి

Jun 22 2025 4:27 PM | Updated on Jun 22 2025 5:23 PM

Fire Breaks Out In Car In Tirupati District

తిరుపతి జిల్లా: చంద్రగిరి మండలం కల్ రోడ్డుపల్లి రోడ్డు ప్రమాదంలో ఒక కారు అగ్నికి ఆహుతి అయ్యింది. ఈ ఘటనలో దంపతులు మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చిత్తూరు జిల్లా రామాపురం పంచాయతీ కుప్పిగానిపల్లికి చెందిన సిద్దయ్య కుటుంబం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగి చిత్తూరుకు వెళుతుండగా కారు చంద్రగిరి మండలం కల్ రోడ్డుపల్లి వద్ద డివైడర్‌ను వేగంగా డీకొంది.

ఈ ఘటనలో సిద్దయ్య (40), ఆయన భార్య అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనం తిరుపతి రూయా ఆసుపత్రికి తరలించగా చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 


  ‌

Advertisement
 
Advertisement
Advertisement