
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఆదివారం తెల్లవారుజామున 4:20 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పోలీస్ వాహనాన్ని కియా కారు ఢీకొట్టింది. లంగర్ హౌస్ దర్గా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కారులో ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు ప్రయాణం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ప్రమాదంలో యువతి కశ్వి(20) అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసు వాహనంలో ఉన్న ముగ్గురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసినట్లు గుర్తించారు. కారులో మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.