
హైదరాబాద్: ఓ కన్నతల్లి తన ఇద్దరు కవల పిల్లలను చంపి, ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం ఉదయం జరిగింది. సీఐ టి.నరసింహరాజు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మానగర్ ఫేజ్–2లో సాయిలక్ష్మి (27), అనిల్‌కుమార్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కవల పిల్లలు అయిన అబ్బాయి చేతన్ కార్తికేయ (2), అమ్మాయి లాస్యవల్లి ఉన్నారు. అబ్బాయి బుద్ధిమాంద్యంతో పుట్టడంతో పిల్లల విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో సాయిలక్ష్మి తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇద్దరు పిల్లల గొంతునులిమి చంపేసింది. అనంతరం భవనంలోని మూడవ అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.