ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, కారు ఢీ.. ముగ్గురి మృతి | Three People Died In Road Accident On Srisailam Hyderabad Road, More Details Inside | Sakshi
Sakshi News home page

Srisailam Road Accident: ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, కారు ఢీ.. ముగ్గురి మృతి

Published Fri, May 24 2024 9:02 AM

Road Accident On Srisailam Hyderabad Road

సాక్షి, రంగారెడ్డి జిల్లా: శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఆమనగల్ మండలం అయ్య సాగర్ సమీపంలో బస్సు-కారు ఢీకొని కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు.

కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వెళుతున్న కారు.. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను పోలీసులు, స్థానికులు జేసీబీ సహాయంతో వెలికితీశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement