గాంధీనగర్: ఓ టీచర్ మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు. బైక్‌ను ఢీకొట్టి, దానిపై ఉన్న వారిని కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లారు. ఆపై ప్రాణం తీశాడు. ఈ ఘటన గుజరాత్‌లోని మోడస లునావాడ వద్ద చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించే టీచర్ అతడి సోదరుడు పూటుగా మద్యం సేవించారు. కన్ను మిన్ను కానరాకుండా రెచ్చిపోయి మరీ డ్రైవింగ్ చేశారు. మద్యం తాగి ఒళ్లు తెలియని మైకంలో కారు నడుపుతోన్న టీచర్ ఓ బైక్‌ను ఢీకొట్టాడు. ఆపై బైక్‌ను ఢీకొట్టిన విషయాన్ని గుర్తించడకుండా బానెట్‌పై పడిన వ్యక్తిని అలాగే 1.5 కి.మీ మేర ఈడ్చుకెళ్లాడు. ఆ తర్వాత మితిమీరిన వేగం దాటికి బానెట్‌పై ఉన్న బాధితుడు కిందపడ్డాడు. ఈ హిట్ అండ్ రన్ కేసు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు. మరో వ్యక్తి చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొంతున్నట్లు తెలుస్తోంది.
ఇక ప్రమాదానికి సంబంధించిన సోషల్ మీడియాలో వెలుగులోకి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సోషల్ మీడియాలో వైరల్ వీడియో ఆధారంగా ఈ దుర్ఘటన మహిసాగర్ జిల్లాలోని మోడాసా-లునావాడ నేషల్ హైవే 48లో జరిగినట్లు గుర్తించారు.
హిట్ అండ్ రన్ నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు మనీశ్ పటేల్, మెహుల్ పటేల్‌గా పోలీసులు గుర్తించారు. ఇక గాయపడిన ఇద్దరు బాధితులను లునావాడాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
#Mahisagar: મોડાસા લુણાવાડા રોડ પર હિટ એન્ડ રનની ચોંકાવનારી ઘટના આવી સામે, કાર ચાલકે બાઈક ચાલકને અકસ્માત સર્જી બચાવવાની જગ્યાએ ૩-૪ કિલોમીટર સુધી કાર ઉપર ઢસડીને લઈ ગયો.. અન્ય કારચાલકો દ્વારા કારચાલકને રોકી પોલીસના હવાલે કર્યો..#Gujarat #ViralVideo pic.twitter.com/7H5HUQYlFW
— 🇮🇳Parth Amin (@Imparth_amin) October 29, 2025


