సాక్షి, న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ రెండు రోజుల పా టు తెలంగాణలో పర్య టించనున్నారు. శనివారం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్‌పర్సన్‌ల జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు.
21న నందిగామ లోని కన్హా శాంతి వనంలోని హార్ట్‌ఫు ల్‌నెస్ గ్లోబల్ ప్రధాన కార్యాలయంలో జరిగే ప్రపంచ ధ్యాన దినోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారని ఉపరాష్ట్రపతి సచివాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.


