కారుపై చెత్త.. ఇదే శిక్ష | cars block garbage clearance quthbullapur ghmc dumps trash on vehicles | Sakshi
Sakshi News home page

కారుపై చెత్త.. ఇదే శిక్ష

Mar 31 2026 10:38 AM | Updated on Mar 31 2026 1:26 PM

cars block garbage clearance quthbullapur ghmc dumps trash on vehicles

హైదరాబాద్‌:   చెత్త తరలించేందుకు అవకాశం లేకుండా కార్లను అడ్డుగా పార్కింగ్‌ చేయడంతో కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ అధికారులు వినూత్న రీతిలో చర్యలు తీసుకున్నారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జీడిమెట్ల డివిజన్‌ దుర్గా ఎస్టేట్‌ కమ్యూనిటీ హాల్‌ వద్ద పరిశుభ్రత పనులు చేయడానికి సోమవారం ఉదయం జీహెచ్‌ఎంసీ సిబ్బంది వచ్చారు. 

రోడ్ల పక్కన పోగైన చెత్తను, పిచ్చి మొక్కలను తొలగించడానికి జేసీబీ, టిప్పర్లను తీసుకోవచ్చారు.  సర్కిల్‌ ఉప కమిషనర్‌ శంకర్‌ సింగ్‌  కూడా  వచ్చారు. అడ్డుగా ఉన్న కార్ల యజమానులకు ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో  ఉప కమిషనర్‌ ఆదేశాల మేరకు చెత్తను కార్లపై వేయించారు. దీంతో అటుగా వెళుతున్న వారు ఈ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూశారు.   

Advertisement
 
Advertisement
Advertisement