
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లు చైనాలోని తియాంజిన్‌లో జరగబోయే ద్వైపాక్షిక సమావేశానికి చేరేందుకు ఒకే కారులో ప్రయాణించారు. ఈ ఘటన అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఇది ఇరువురి నేతల సాన్నిహిత్యాన్ని లోకానికి చాటిందని నిపుణులు అంటున్నారు. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశం అనంతరం ఇరు దేశాధినేతలు ఒకే కారులో ప్రయాణించారు.
After the proceedings at the SCO Summit venue, President Putin and I travelled together to the venue of our bilateral meeting. Conversations with him are always insightful. pic.twitter.com/oYZVGDLxtc
— Narendra Modi (@narendramodi) September 1, 2025
పుతిన్‌తో తన ప్రయాణానికి సంబంధించిన ఫొటోను ‘ఎక్స్’లో షేర్ చేసిన ప్రధాని మోదీ.. ‘ఎస్‌సీఓ శిఖరాగ్ర సమావేశం తర్వాత, అధ్యక్షుడు పుతిన్, నేను మా ద్వైపాక్షిక సమావేశ వేదికకు కలిసి ప్రయాణించాం. ఆయనతో సంభాషణలు లోతుగా ఉంటాయి’ అని రాశారు. ఈ శిఖరాగ్ర సమావేశానికి ముందు, ప్రధాని మోదీ, అధ్యక్షుడు పుతిన్ కరచాలనం చేసుకుని ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఆ సమయంలో ప్రధాని మోదీ ‘అధ్యక్షుడు పుతిన్‌ను కలవడం ఆనందంగా ఉంది’ అంటూ ఒక ఫోటోను షేర్ చేశారు.