ఢిల్లీ: ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసులో పాటియాలా హౌస్ కోర్టులో 7,500 పేజీల చార్జ్‌షీట్ దాఖలైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉమర్ ఉన్ నబీ సహా 10 మందిని నిందితులుగా ఎన్‌ఐఏ పేర్కొంది. ఢిల్లీలో గత ఏడాది నవంబర్ 10న బాంబు పేలుడులో 11 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. అన్సార్ గజ్వతుల్ హింద్ (AGuH) సంస్థతో ముడిపడినట్టు ఎన్‌ఐఏ వెల్లడించింది AGuH అనేది అల్-ఖైదా ఇన్ ఇండియన్ సబ్‌కాంటినెంట్ (AQIS) ఆఫ్‌షూట్.. 2018లో కేంద్రం ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.
UA(P) యాక్ట్ భారతీయ న్యాయ సంహిత, ఎక్స్‌ప్లోసివ్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్‌తో సహా అనేక సెక్షన్ల కింద కేసు నమోదైంది. నిందితుల్లో పలువురు వైద్యులు.. AQIS/AGuH ఆలోచనలతో ప్రేరణ పొంది దాడి చేసినట్ట ఎన్‌ఐఏ తెలిపింది. 2022లో శ్రీనగర్‌లో రహస్య సమావేశం నిర్వహించారని.. AGuHని AGuH ఇంటరిమ్”గా పునరుద్ధరించి “ఆపరేషన్ హెవెన్లీ హింద్” ప్రారంభించినట్టు ఎన్‌ఐఏ పేర్కొంది. నిందితులు.. వాణిజ్య రసాయనాలతో TATP ఎక్స్‌ప్లోసివ్ తయారు చేశారు. ఐఈడీలు, రాకెట్, డ్రోన్ మౌంటెడ్ బాంబులు పరీక్షించారు. ఏకే-47, క్రింకోవ్ రైఫిళ్లు, పిస్టల్స్ లాంటి నిషేధిత ఆయుధాలు అక్రమంగా సేకరించారు.
డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్, ఫోరెన్సిక్, వాయిస్ అనాలిసిస్‌తో ఎన్‌ఐఏ ఆధారాలు సేకరించింది. జమ్మూ కశ్మీర్, హర్యానా, యూపీ, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో విస్తృత దర్యాప్తు చేపట్టింది. 88 సాక్షులు, 395పైగా డాక్యుమెంట్లు, 200పైగా ఆధారాలు సేకరించింది. ఇంకా కొందర నిందితుల కోసం ఎన్‌ఐఏ గాలింపు కొనసాగుతోంది.


