
వాహన ఫ్యాన్సీ నంబర్‌కు వెచ్చించిన ఓ వ్యాపారి
ఖిలా వరంగల్: వరంగల్ నగరానికి చెందిన ఓ వ్యాపారి అధిక మొత్తంలో చెల్లించి ఫ్యాన్సీ నంబర్‌ను దక్కించుకున్నట్లు వరంగల్ ఇన్‌చార్జ్ ఆర్టీఓ శోభన్‌బాబు శుక్రవారం తెలిపారు. కారు నంబర్ ప్లేట్‌పై తనకు నచ్చిన లక్కీ నంబర్ ఉండాలనే ఆశతో 9999 ఫ్యాన్సీ నంబర్‌ను ఆన్‌లైన్ ద్వారా రూ.11,09,999 చెల్లించి హర్ష కన్‌స్ట్రక్షన్స్ పేరు మీద దక్కించుకున్నట్లు వివరించారు. ఇంత మొత్తం ఖర్చు చేసి నంబర్ దక్కించుకోవడంపై ఆర్టీఏ అధికారులు సైతం అవాక్కయ్యారు. సదరు వ్యాపారి ఫ్యాన్సీ నంబర్ కోసం చాలా రోజులుగా ప్రయత్నిస్తూ ఈసారి అధిక మొత్తం వెచ్చించి దక్కించుకున్నట్లు చెప్పారు.