
ప్రముఖ బాలీవుడ్ నటి, హేమ మాలిని ఖరీదైన కారును కొనుగోలు చేసింది. తన కొత్త కారుకు పూజ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ లగ్జరీ కారు విలువు దాదాపు రూ.75 లక్షలకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇది చూసిన అభిమానులతో పాటు నెటిజన్స్ సైతం అభినందనలు చెబుతున్నారు.
బాలీవుడ్లో డ్రీమ్ గర్ల్పై పేరున్న హేమ మాలిని పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. పలువురు అగ్ర హీరోల సరసన మెప్పించారు. 1970-80 సమయంలో స్టార్ హీరోయిన్గా రాణించారు. ఆమె చివరిసారిగా 2020లో విడుదలైన సిమ్లా మిర్చి చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం మధుర నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.