
సూర్యాపేట జిల్లా: జిల్లాలోని నెరేడుచర్ల మండలం కల్లూరులో ప్రమాదం తప్పింది. అదుపు తప్పి సాగర్ ఎడమ కాలువలో కారు బోల్తా పడింది. నేరేడుచర్ల నుంచి కల్లూరు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. ఆ సమయంలో కారులో డ్రైవర్ మాత్రమే ఉన్నట్లు తెలుస్తుంది. డ్రైవర్ కూడా సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. ఆపై కారును రెస్క్కూ టీమ్ సహాయంతో బయటకు తీశారు.