సాక్షి హైదరాబాద్: సృష్టి ఫెర్టిలిటీ కేసులో అరెస్టైన ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతా బెయిల్ పై విడుదలయ్యారు. సరోగసీ పేరుతో అక్రమాలు, పిల్లల విక్రయం వంటి పలు అభియోగాలు ఆమెపై నమోదైన సంగతి తెలిసిందే.
హైదరాబాద్ లో సరోగసీ పేరుతో 'సృష్టి' ఫెర్టిలిటీ సెంటర్ చాలా మోసాలు చేస్తోందని గతంలో కేసులు నమోదయ్యాయి. ఐవీఎఫ్(IVF) కోసం వచ్చే వారిని సరోగసీ వైపు మళ్లించి డబ్బులు దోచుకున్నారని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. దీనికోసం ఏపీలో కొంత మంది ఏఎన్‌ఎం(ANM)ల సహాయం కూడా తీసుకున్నారని విచారణలో తేలింది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని సృష్టి యూనివర్సల్ ఫెర్టిలిటీ సెంటర్ యజమాని డాక్టర్ నమ్రతను జులై 27న పోలీసులు అరెస్టు చేశారు. సరోగసీ చేయకపోయినా చేసినట్లు నమ్మించి పలువురు దంపతులను మోసం చేశారని, ఐవీఎఫ్(IVF) కోసం వచ్చే వారిని సరోగసీ వైపు మళ్లించి డబ్బులు దోచుకున్నారని. తదితర ఆరోపణలతో డాక్టర్ నమ్రతపై కేసులు నమోదు చేశారు.
అంతేకాకుండా డాక్టర్ నమ్రతతో కలిసి 1988లో ఆంధ్ర వైద్య కళాశాలలో వైద్యవిద్యను చదివిన ముగ్గురు వైద్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితురాలు నమ్రతా బెయిల్ పై విడుదలయ్యారు.


