వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సరికొత్త నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన ఫైళ్లను విడుదల చేయాలంటూ తన పరిపాలనపై ఒత్తిడి పెరిగిన దరిమిలా దీనిపై ఓటింగ్‌కు ఆయన హౌస్ రిపబ్లికన్‌లకు పిలుపునిచ్చారు.
ఎప్‌స్టీన్ ఫెడరల్ రికార్డులను బహిర్గతం చేయడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంతకాలం చేసిన ప్రచారానికి అకస్మాత్తుగా ముగింపు పలికారు. ఆదివారం రాత్రి త ట్రూత్ సోషల్‌లో.. ట్రంప్ తన మునుపటి డిమాండ్‌ను పక్కన పెడుతూ ‘ఎప్‌స్టీన్ ఫైళ్లను విడుదల చేయడానికి హౌస్ రిపబ్లికన్లు ఓటు వేయాలి. ఎందుకంటే మన దగ్గర దాచడానికి ఏమీ లేదు’ అని పేర్కొన్నారు. గత కొన్ని నెలలుగా న్యాయ శాఖపై ఒత్తిడి తెచ్చిన ఈ బిల్లు హౌస్ లోపల తీవ్రమైన నాటకీయ పరిణామాలకు దారితీసింది. గత వారంలో ఈ చర్యపై ఫ్లోర్ ఓటింగ్‌ను నిరోధించేందుకు ట్రంప్, స్పీకర్ మైక్ జాన్సన్ తీవ్రంగా ప్రయత్నించారు. అయితే డెమొక్రాట్లతో కలిసి ఓటు వేయడానికి దాదాపు 100 మంది రిపబ్లికన్లు సిద్ధంగా ఉన్నారని స్పష్టమైంది. ఈ బిల్లుపై ఓటింగ్ మంగళవారం జరగనుంది.
NEW: Epstein survivors release the most powerful PSA I have ever seen.
Make this go viral so every member of the House of Representatives sees it. pic.twitter.com/Cb5mUqQDFd— Aaron Parnas (@AaronParnas) November 16, 2025
ఎప్‌స్టీన్ ఫైళ్లలో ఏముంది?
లైంగిక నేరస్థుడు ఎప్‌స్టీన్, అతని సహచరి గిస్లైన్ మాక్స్‌వెల్‌లు పలువురు బాలికలను, మైనర్లను తమ మాన్‌హాటన్ భవనం, ఫ్లోరిడా ఎస్టేట్, వర్జిన్ ఐలాండ్స్‌లోని సొంత ద్వీపం తదితర ప్రదేశాలకు తరలించి, లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలకు సంబంధించిన ఫైల్స్‌లో బాధితుల సాక్ష్యాలు, వారికి డబ్బులు చెల్లించిన వివరాలు, రిక్రూట్‌మెంట్ పద్ధతులు ఉన్నాయి. ఈ విధమైన వేధింపులకు గురైన బాధితుల సంఖ్య వెయ్యికి పైనే ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.
ఎప్‌స్టీన్ సామాజిక సర్కిల్‌లో పలువురు అమెరికా రాజకీయ నేతలు, ప్రముఖులు, సంపన్నుల పేర్లు ఉన్నాయి. ఇవి ఎప్స్టీన్ బ్లాక్ బుక్, విమాన ప్రయాణాల లాగ్‌లు (ఫ్లైట్ లాగ్స్),ఇతర పత్రాల నుండి బహిర్గతమయ్యాయి. కొన్ని పత్రాలలో డొనాల్డ్ ట్రంప్ పేరు, అతని కార్యకలాపాల గురించి ఎప్‌స్టీన్ దగ్గర పనిచేసే ఉద్యోగులు, పైలట్, ఇతరుల మధ్య జరిగిన ఈ మెయిల్ సంభాషణలు ఉన్నాయి. ట్రంప్‌తో తనకున్న సంబంధం, అతని విమాన ప్రయాణాలు, ఎప్‌స్టీన్ రాసిన ఈ మెయిల్స్ ఇందులో ఉన్నాయి. అయితే ట్రంప్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.
మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ తదితర ప్రముఖుల పేర్లు కూడా పత్రాలలో కనిపించాయి. అయితే ఈ పేర్లు కేవలం కాంటాక్ట్ బుక్‌లు, విమాన లాగ్‌లు లేదా ఎప్స్టీన్ బర్త్‌డే బుక్ లోని సందేశాల రూపంలో ఉన్నాయే తప్ప, వారంతా నేరాలలో భాగస్వామ్యం అయ్యారని స్పష్టంగా రుజువు చేసే సాక్ష్యాలు బహిరంగంగా విడుదల కాలేదు.
అలాగే ఈ ఫైల్స్‌లో ఎప్‌స్టీన్‌పై 2008లో జరిగిన వివాదాస్పద ప్లీ డీల్, అప్పటి యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ (డీఓజే) అధికారులు తీసుకున్న నిర్ణయాలు, 2019లో జరిగిన అరెస్ట్ వివరాలు కూడా ఉన్నాయి. ఎఫ్‌బీఐ (ఎఫ్‌బీఐ) దర్యాప్తులో 300 గిగాబైట్‌ల డేటా, భౌతిక సాక్ష్యాలు లభించాయి. ఇందులో ఎప్‌స్టీన్ ఫొటోలు, మైనర్‌ల లైంగిక చర్యల వీడియోలు, చిత్రాలు, బాధితులకు సంబంధించిన సున్నితమైన వివరాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Pakistan: మళ్లీ ‘జాఫర్ ఎక్స్‌ప్రెస్’ టార్గెట్.. రైలు వెళ్లగానే పేలుడు


