వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్టు ట్రంప్ వెల్లడించారు. ఈ క్రమంలో రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై దాదాపు 500 శాతం సుంకాలు విధించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం ఆపేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. రెండు దేశాల యుద్ధం ముగించేందుకు ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నారు. ఇరు దేశాల అధ్యక్షులతో భేటీ కూడా అయ్యారు. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అది సాధ్యం కాకపోవడంతో రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై ట్రంప్ పెద్దమొత్తంలో సుంకాలు విధిస్తున్న విషయం తెలిసిందే. అది కూడా దాదాపు విఫలం కావడంతో ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యాకు సహకరిస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవడం తప్ప ప్రస్తుతం తమ దేశానికి వేరే మార్గం లేదని ట్రంప్ పేర్కొన్నారు.
రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై 500 శాతం టారిఫ్‌లు విధిస్తానన్నారు. సుంకాల పెంపునకు సంబంధించిన బిల్లుకు తాను మద్దతిస్తున్నట్లు తాజాగా ట్రంప్ వెల్లడించారు. అయితే, ఈ దేశాల జాబితాలో భారత్, చైనా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌ను కూడా ఇందులో చేర్చనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ.. ఉక్రెయిన్‌కు సాయం చేయని దేశాల ఉత్పత్తులపై 500 శాతం సుంకం విధిస్తున్నామన్నారు. భారత్, చైనాలే ఆ దేశం నుంచి 70శాతం చమురును కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే.. రష్యా నుంచి పెద్దమొత్తంలో ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. మన ఔషధాలు, వస్త్రాలు వంటి ఎగుమతులపై ప్రభావం పడనుంది.
BREAKING:
US president Trump approves bill allowing tariffs up to 500% on countries trading with Russia. pic.twitter.com/Lko3wXVuLU— Recon & surveillance (@Recon_surv) November 17, 2025


