చదువు పాతదాయె.. కొలువు కొత్తగాయె, ఇంట్రస్టింగ్‌ సర్వే! | Survey : current Job roles Eight in 10 Indians find their degrees inadequate for job | Sakshi
Sakshi News home page

చదువు పాతదాయె.. కొలువు కొత్తగాయె, ఇంట్రస్టింగ్‌ సర్వే!

Mar 10 2025 3:05 PM | Updated on Mar 10 2025 3:31 PM

Survey : current Job roles Eight in 10 Indians find their degrees inadequate for job

ప్రస్తుత జాబ్‌మార్కెట్‌ను అందుకోలేకపోతున్న టెకీలు 

డిమాండ్‌కు తగ్గట్టుగా లేని విద్యార్హతలు, అనుభవాలు

దేశంలోని ప్రతి 10 మందిలో 8 మంది వృత్తి

నిపుణులది ఇదే సమస్య  

గురుగోవింద్‌సింగ్‌ ఇంద్రప్రస్థ వర్సిటీ అధ్యయనంలో వెల్లడి 

టెక్‌ ప్రపంచంలో రోజుకో కొత్త సాంకేతికత పుట్టుకొస్తోంది. ఒక టెక్నాలజీని నేర్చుకోవటం మొదలుపెట్టేలోపు.. కొంగొత్తది పుట్టుకొచ్చి. నేర్చుకునేది పాతబడిపోతోంది. చదివిన చదువుకు, సాధించిన డిగ్రీలకు.. ఇప్పుడున్న మార్కెట్‌ అవసరాలకు పొంతనే లేకుండా పోతోంది. దేశంలోని 80 % వృత్తి నిపుణులది ఇప్పుడు ఇదే సమస్య. కృత్రిమ మేధ, మిషన్‌ లరి్నంగ్, జనరేటివ్‌ ఏఐ, డేటా అనలిటిక్స్‌ వంటి నైపుణ్యాలున్న వారికి మంచి ప్యాకేజీలతో అవకాశాలు లభిస్తున్నాయి. కానీ, పాతకాలపు టెక్నాలజీ కోర్సులు చదివినవారికి ఎంత వృత్తి అనుభవం ఉన్నా కొత్త ఉద్యోగాలు దొరకటం లేదు. గురుగోవింద్‌సింగ్‌ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ, హీరోవైర్డ్‌ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఇలాంటి అనేక విషయాలు వెల్లడయ్యాయి.

 సర్వేలోని ముఖ్యాంశాలు

  • దేశంలోని ప్రతి 10 మంది వృత్తి నిపుణుల్లో 8 మంది విద్యార్హతలు ప్రస్తుత జాబ్‌ మార్కెట్‌ అవసరాలకు సరిపోవడం లేదు. కాలేజీల్లో నేర్చుకున్నదానికిభిన్నంగా జాబ్‌ మార్కెట్‌ఉండడంతో.. అందుకు తగ్గట్టుగా తాము సిద్ధం కాలేకపోతున్నామని సర్వేలో పాల్గొన్న వారిలో 77% మంది తెలిపారు. 

  • నేటి అవసరాలకు తగ్గట్టుగా తమనుతాము మలుచుకోవాలంటే ఏఐ టెక్నాలజీపై పట్టుసాధించాలని 90.1 శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం డేటా అనలిటిక్స్‌ కీలకపాత్ర పోషిస్తున్నట్లు 89.6 శాతం మంది తెలిపారు. 

  • ఆగ్‌మెంటెడ్‌ అనలిటిక్స్‌ ఓ గేమ్‌ఛేంజర్‌గా మారుతున్నదని 72 శాతం వృత్తి నిపుణులు అభిప్రాయపడ్డారు.  (Amrutha Pranay Case Verdict : పీవోడబ్ల్యూ సంధ్య స్పందన ఇదే!)

  • సస్టెయినబుల్‌ ఇన్నోవేషన్‌ ఒక ముఖ్యమైన పరిశ్రమగా ఉద్భవిస్తోందని 69.7 శాతం మంది చెప్పారు. 

  • క్రియేటివ్‌ ఆంట్ర ప్రెన్యూర్‌షిప్‌ ద్వారా సుస్థిరమైనకెరీర్‌ను నిర్మించు కోవచ్చని 62.3%అభిప్రాయం 

నిపుణులు సూచలు
 

  • ప్రస్తుత జాబ్‌మార్కెట్‌లో అందుబాటులో ఉన్నఅవకాశాలకు తగ్గట్టుగా ఆధునిక సాంకేతికతలపై పట్టు సాధించాలి. సాంకేతికతపై పట్టుకే పరిమితం కాకుండాసృజనాత్మకత, టీంవర్క్,సవాళ్లకు తగ్గట్టుగాస్పందించే తీరుతోనే ప్రయోజనం ఉంటుంది.  

  • ఎప్పటికప్పుడు మారుతున్న ‘జాబ్‌ రోల్స్‌’కు అనుగుణంగానైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలి. నైపుణ్యాలకు తగ్గట్టుగా కెరీర్‌ను ఎంచుకోవాలి.  

  • ఏఐ నైపుణ్యాలకే పరిమితంకాకుండా కంటెంట్‌ క్రియేషన్,డేటా అనలిటిక్స్‌ వంటి వాటి ద్వారా కూడా ముందుకు సాగొచ్చు. 

  • గతంలో ఓ వెలుగు వెలిగినఇంజనీరింగ్, మీడియా/ఎంటర్‌టైన్‌మెంట్, మెడిసిన్‌ వంటి రంగాలు ప్రస్తుతం కొంత నెమ్మదిస్తున్నాయి.

  • ఆగ్‌మెంటెడ్‌ అనలిటిక్స్, సస్టెయినబుల్‌ ఇన్నోవేషన్, క్రియేటివ్‌ ఆంట్రప్రెన్యూర్‌షిప్, మల్టీసెన్సరీ డిజైన్‌ వంటివి ప్రాధాన్యం సాధిస్తున్నాయి.

- సాక్షి, హైదరాబాద్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement