
పర్యాటకులు ఎక్కువగా.. బీచ్‌లను సందర్శించడానికి ఇష్టపడుతుంటారు. ఈ ఏడాది కూడా చాలామంది గోవా బీచ్ మొదలు.. లంకావి ఆజ్యూర్ వాటర్స్, కాప్రి తీరప్రాంతాల వరకు దేశీయ, అంతర్జాతీయ బీచ్‌లపైనే ఎక్కువ ఆసక్తి చూపించారని ఎయిర్‌బీఎన్‌బీ వెల్లడించింది.
మన దేశంలో ఎక్కువమంది పర్యాటకులు సెర్చ్ చేసిన ప్రదేశాలలో.. గోవా అగ్రస్థానంలో నిలిచింది. కొంతమంది పర్యాటకులు మాత్రం.. నిశ్శబ్ద తీరప్రాంత గ్రామాలు, చేతివృత్తుల అనుభవాలు, క్లాసిక్ బీచ్‌ల కోసం వెతికారు. గోవా కాకున్నా భారతదేశంలో ఇతర బీచ్‌ల కోసం వెతికేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఆధ్యాత్మిక ప్రదేశాల కోసం సెర్చ్ చేసిన జాబితాలో ఒడిశాలోని పూరి ముందు వరుసలో నిలిచింది. తీరప్రాంత సౌందర్యం కోసం పుదుచ్చేరిని ఎంపిక చేసుకుంటున్నారు.