
వాళ్ల స్థానంలో అమెరికన్లకు ఉపాధి కల్పించండి
అమెరికా టెక్ దిగ్గజ సంస్థలకు ట్రంప్ ఆదేశాలు
న్యూయార్క్/వాషింగ్టన్: విపరీతమైన వీసా ఆంక్షలు అమలుచేస్తూ, సోషల్‌మీడియా ఖాతాలను జల్లెడపడుతూ వీలైనంతవరకు భారతీయులను అమెరికా గడ్డపై కాలుమోపకుండా అడ్డు తగులుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు నేరుగా అక్కడి కంపెనీలకే ఆదేశాలు ఇచ్చేందుకు తెగించారు. చట్టబద్ధంగా, అత్యంత నైపుణ్యముండి వీసాలతో అమెరికాకొస్తున్న భారతీయులను కాదని, అమెరికన్లకే కొలువుల్లో పట్టంకట్టాలని ట్రంప్ అక్కడి టెక్ దిగ్గజ సంస్థలకు హితవు పలికారు. బుధవారం వాషింగ్టన్‌లో జరిగిన ఏఐ సదస్సులో ట్రంప్ పాల్గొని ప్రసంగించారు.
మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలనుద్దేశిస్తూ సూటిగా సూచనలు ఇచ్చారు. ‘‘ వేర్పాటు వాదంలాంటి ప్రపంచీకరణ (గ్లోబలైజేషన్) భావాజలంలో మన అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలు కొట్టుకుపోతున్నాయి. గ్లోబలైజేషన్ కోసం పరితపిస్తున్నాయి. ఈ క్రమంలో కంపెనీలన్నీ కోట్లాది మంది అమెరికన్ల విశ్వాసాన్ని కోల్పోయి కృతçఘ్నులుగా తయారవుతున్నాయి. మీరు తోటి అమెరికన్ల పట్ల తీవ్ర నిర్లక్ష ధోరణిని కనబరుస్తున్నారు. అమెరికాలో లభించిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ ఇక్కడి కంపెనీలు చైనాలో భారీ ఫ్యాక్టరీలు నిర్మిస్తున్నాయి.
భారత్ నుంచి తక్కువ జీతభత్యాలకు ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ఐర్లాండ్‌లో నష్టాలు వస్తున్నాయన్న సాకుతో ఇక్కడ లాభాలను తక్కువచేసి చూపిస్తూ పన్నుల భారాన్ని తగ్గించుకుంటున్నాయి. ఇవన్నీ చేస్తూ మీ తోటి అమెరికన్‌పౌరుల ఉద్యోగ హక్కులను కాలరాస్తున్నారు. ఇక నా హయాంలో మీ ఆటలు సాగవు. అమెరికా టెక్నాలజీ సంస్థలన్నీ మన దేశ ప్రయోజనాలకే పెద్దపీట వేయాలి. ఫ్యాక్టరీల కల్ప నలో, ఉద్యోగాల్లో అమెరికన్లకే తొలి ప్రాధాన్యం దక్కాలి. ఇకనైనా భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వడం ఆపండి. అమెరికన్లకు ఉపాధి కల్పించండి. మిమ్మల్ని నేను అడిగేది ఇదొక్కటే. ఈ పని మీరు ఖచ్చితంగా చేస్తారనే భావిస్తున్నా’’ అని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు.
#WATCH | Trump promises to bring tech jobs back home, slamming US firms for outsourcing to China and hiring Indian workers abroad.#DonaldTrump #UnitedStates #China #India pic.twitter.com/p2KLKkDqj9
— News18 (@CNNnews18) July 24, 2025
ట్రంప్ వ్యాఖ్యలు.. భారతదేశంపై ప్రభావం
ట్రంప్ వ్యాఖ్యలు అమెరికా-భారత టెక్ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇండియన్ IT ఉద్యోగాలు, అవుట్‌సోర్సింగ్ రంగం పై ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉంది.
“No more Indian workers” అని ట్రంప్ స్పష్టంగా హెచ్చరించారు.
Apple, Google, Tesla వంటి కంపెనీలు భారతదేశం లో ఉద్యోగాలు ఇవ్వడం పై 25% టారిఫ్ విధించవచ్చని హెచ్చరిక జారీ చేశారు.