‘వీసా’ భయాలతో భారతీయ విద్యార్థులు ఏం చేస్తున్నారంటే.. | NRI News: Indian Students Did This For American Visas On Social Media | Sakshi
Sakshi News home page

‘వీసా’ భయాలతో భారతీయ విద్యార్థులు ఏం చేస్తున్నారంటే..

Jun 5 2025 10:27 AM | Updated on Jun 5 2025 3:31 PM

NRI News: Indian Students Did This For American Visas On Social Media

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) వరుస నిర్ణయాలతో విదేశీ విద్యార్థులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉన్నవాళ్లను సొంత దేశాలకు పంపించేయడం.. కొత్త వాళ్లను అమెరికాలో అడుగుపెట్టనివ్వకుండా కఠిన ఆంక్షల దిశగా అడుగులేస్తున్నారాయన. ఈ క్రమంలో వీసాల కోసం ప్రయత్నిస్తున్న భారతీయ విద్యార్థులు(Indian Students) అప్రమత్తం అయ్యారు. కొందరు తాము చేసిన పోస్టులు తొలగిస్తుండగా.. మరికొందరు ఏకంగా సోషల్‌ మీడియా అకౌంట్లను డిలీట్‌ చేస్తున్నారు. 

విదేశీ విద్యార్థులకు వీసాలు(American Visas) మంజూరు చేయడానికి ముందు వారి సోషల్‌ మీడియా ఖాతాలను తనిఖీలు చేసే పనిలో అమెరికా అధికార యంత్రాంగం ఉంది. ఇందుకోసం అర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీని ఉపయోగిస్తోంది. పాలస్తీనా మద్దతుదారుల దగ్గరి నుంచి.. యూఎస్‌ క్యాంపస్‌లలో జరిగిన వివిధ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులను ఈ సాంకేతికత ఉపయోగించే బయటకు పంపించేసింది. ఈ క్రమంలో.. 

అతిగా ఉన్న పోస్టులు చూస్తే చిక్కుల్లో పడతామనే భావనతో అలాంటి వాటిని భారతీయ విద్యార్థులు డిలీట్‌ చేస్తున్నారు.  ఫేస్‌బుక్‌, ఎక్స్‌, లింక్డిన​, టిక్‌టాక్‌ ఇలా ఇతర ఫ్లాట్‌ఫారమ్‌లన్నింటిని జల్లెడ పడుతున్నారు. వాటిల్లో తమ యాక్టివిటీ( పోస్టులు చేయడంతో పాటు లైకులు, షేర్లు, కామెంట్లు.. వగైరా)ని తొలగిస్తున్నారు. కొందరైతే ఏకంగా అకౌంట్‌నే తొలగిస్తున్నట్లు సమాచారం.

అభిప్రాయాల దగ్గరి నుంచి పొలిటికల్‌ జోక్స్‌ దాకా వేటిని తమ టైం లైన్‌లో ఉంచడం లేదు. అమెరికా అధికారులు వాటిని చూస్తే వీసాలు రిజెక్ట్‌ అవుతాయని భయపడుతున్నారు. అయితే ఇలా హఠాత్తుగా అకౌంట్లనూ తొలగించడమూ మంచిది కాదనే అభిప్రాయాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement