79 ఏళ్ల తర్వాత..మా ఊరికి బస్సొచ్చిందహో! | Kurthal village in Rajasthans Ajmer district bus service nearly 79 years after | Sakshi
Sakshi News home page

79 ఏళ్ల తర్వాత..మా ఊరికి బస్సొచ్చిందహో!

Aug 12 2026 12:54 PM | Updated on Aug 12 2026 12:59 PM

Kurthal village in Rajasthans Ajmer district bus service nearly 79 years after

ఒకప్పుడు ఆ ఊరివాళ్లు బస్సు ఎక్కాలంటే ఎన్నో కిలోమీటర్‌ల దూరం నడిచి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు వారికి ఆ శ్రమ తప్పింది. బస్సు వారిని వెదుక్కుంటూ వచ్చింది. రాజస్థాన్‌లోని అజ్మీర్‌ జిల్లాలోని మారుమూల గ్రామం కుర్తాల్‌లో తొలిసారిగా బస్సు సర్వీస్‌ మొదలైంది. ఈ బస్సుకు గ్రామస్తులు మేళతాళాలతో ఘనస్వాగతం పలికారు. ఆనందంతో నృత్యాలు చేశారు. సెల్ఫీలు తీసుకున్నారు.

ఈ సరికొత్త బస్సు సర్వీసు గ్రామస్తుల దైనందిన జీవితంలో గణనీయమైన మార్పు తీసుకురానుంది. తమ అవసరాలకు సమీపంలోని పట్టణాలకు వెళ్లడం సులువు అవుతుంది. సమీప పట్టణానికి వెళ్లడానికి ఇప్పటివరకు ప్రైవేట్‌ వాహనాలపై ఆధారపడుతున్న గ్రామస్తులకు ఈ బస్సు సర్వీస్‌ ఊరటనిస్తోంది. ‘స్వాతంత్య్రం వచ్చిన ఎన్నో దశాబ్దాల తరువాత ఒక గ్రామానికి తొలిసారిగా బస్సు వచ్చింది. ఇందుకు కారణం ఏమిటి?’ అనే కోణంలో నెటిజనుల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement