అనంతపురం సెంట్రల్: అనంతపురం నగర వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్లు బూతు పురాణం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాను సీఐ అనే విషయం మరచిపోయి బూతులతో రెచ్చిపోయారు. ఓ పశువుల వ్యాపారితో ఆయన అసభ్యకర సంభాషణ సోషల్ మీడియాలో విన్న నెటిజన్లు ‘ఇతను అసలు సీఐనా.. లేక మరేమైనా’ అని విమర్శిస్తున్నారు. అసలేం జరిగిందంటే... జిల్లాలోనే అతి పెద్ద పశువుల సంత ప్రతి ఆదివారం అనంతపురం మార్కెట్‌యార్డులో జరుగుతుంది. ఇక్కడి నుంచి బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు పశువులను అక్రమంగా కబేళాలకు తరలిస్తున్నారు. ఇలా తరలించే వారు కొంత మంది ముఠాగా ఉన్నారు. ఆ వ్యక్తులు ఎవరన్నది పోలీసులకు తెలుసు. ప్రతి వారం ట్రక్కులు బయలుదేరిన వెంటనే ఆయా మార్గాల్లోని పోలీసు స్టేషన్‌లకు ముడుపులు వెళతాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ తంతు కాస్త ఈ వారం రివర్స్ అయ్యింది.
దళిత నాయకుడు రికార్డు చేయడంతో..
స్థానిక మార్కెట్‌యార్డు నుంచి సోమవారం రాత్రి రెండు ట్రక్కులు పశువులతో బయలుదేరాయి. మార్గమధ్యంలో ఓ దళిత సంఘం నాయకుడు ఆ వాహనాలను తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేసే సమయంలో సదరు సీఐ వాహనం కూడా అక్కడే ఉంది. దీంతో ఏం జరిగిందో ఏమో కానీ.. ‘వాహనాలు వెళ్లడానికి వీల్లేదు. మార్కెట్‌యార్డుకు తరలించాల’ని సీఐ ఆదేశించారు. వాటికి బ్లూకోల్ట్ కానిస్టేబుల్‌ను కాపలాగా ఉంచాడు. అయితే సదరు పశువుల వ్యాపారి కానిస్టేబుల్ కళ్లుగప్పి వాహనాలను రాప్తాడు దాటించాడు. వెంటనే సదరు పశువుల వ్యాపారికి సీఐ ఫోన్ చేసి బూతులు లంకించుకున్నాడు. ‘ఎవరిని అడిగి వాహనాలు తీసుకెళ్లావు రా లం.. కొడకా... మెట్టితో కొడతా.. చెత్తనా కొడకా.. చిల్లర నా కొడకా.. వాహనాలు పట్టుకున్న విషయం ఎస్పీకి, డీఎస్పీకి కూడా చెప్పాను. వెంటనే వాహనాలు మార్కెట్‌యార్డుకు రాకపోతే నీ కాళ్లు విరగ్గొడతా’ అంటూ ఐదు నిమిషాలకు పైగా బూతులతో రెచ్చిపోయారు.
పోలీసు సిబ్బందితోనూ అదే తీరు
నేరం చేసిన వ్యక్తులతోనే కాదు.. పోలీసు స్టేషన్‌కు వచ్చే వారితోనూ.. తన కింద పనిచేసే పోలీసు సిబ్బందితో కూడా సీఐ వెంకటేశ్వర్లు అదే తీరులోనే మాట్లాడతారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందరి ముందూ అవమానకరంగా మాట్లాడుతుండడంతో గతంలో కొంతమంది ఈ స్టేషన్ మాకొద్దు బాబోయ్ అని ఇతర పోలీసుస్టేషన్‌లకు బదిలీపై వెళ్లిపోయారు. కొంతమంది విధిలేక భరిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్.. మర్యాదగా మాట్లాడుకుందాం అనే మాటలు ఈ సీఐకి పనికిరావనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.


