తెలుగు ప్రజలకు వైఎస్‌ జగన్‌ తొలి ఏకాదశి శుభాకాంక్షలు | YS Jagan Extends Tholi Ekadashi 2026 Wishes, Prays For People Peace, Health And Happiness | Sakshi
Sakshi News home page

Tholi Ekadashi 2026: తెలుగు ప్రజలకు వైఎస్‌ జగన్‌ తొలి ఏకాదశి శుభాకాంక్షలు

Jul 25 2026 10:27 AM | Updated on Jul 25 2026 1:11 PM

YS Jagan Extends Ekadashi Greetings to Telugu People

సాక్షి, తాడేపల్లి: ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినాన్ని భక్తి, విశ్వాసాలతో ఆచరిస్తూ శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి పాత్రులు కావాలని ఆకాంక్షించారు.

ఈ మేరకు ఆయన ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా ఓ సందేశాన్ని విడుదల చేశారు. శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

తొలి ఏకాదశి ప్రాశస్త్యం
ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి, దేవశయనీ ఏకాదశిగా పిలుస్తారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజించడం విశేష ఫలితాలను ఇస్తుందని భక్తుల విశ్వాసం. ఈ ఏకాదశి నుంచి చాతుర్మాస దీక్షలు ప్రారంభమవుతాయని పురాణాలు పేర్కొంటాయి. ఈ సమయంలో శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి వెళ్తారని, కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారని నమ్మకం. అందుకే తొలి ఏకాదశిని వైష్ణవ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పర్వదినంగా భావిస్తారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement