అనంతపురం: తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ధ్వజమెత్తారు. తాడిపత్రి నియోజకవర్గంలో తన ఐదేళ్ల పాలనపై, అదే జేసీ 30 ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధంగా ఉన్నానన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి సవాల్‌ను తాను స్వీకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. ‘జేసీ డేట్ ఫిక్స్ చేయండి... కలెక్టర్, ఎస్పీలకు సమాచారం ఇవ్వండి. రాయలసీమ జిల్లాల్లో ఎక్కడైనా చర్చకు సిద్ధం.. మీరు అనుమతులు ఇప్పించండి... నా కుటుంబం మాత్రమే వచ్చి నిజాలు చెబుతాం.
పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం మగతనమా జేసీ ప్రభాకర్ రెడ్డి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలపై జేసీ విమర్శలు చేయడం హాస్యాస్పదం. తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ నేతల అక్రమాలపై కలెక్టర్‌కు రెండు సార్లు ఫిర్యాదు చేశా. విచారణ జరక్కుండా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుపడుతున్నారు. సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసినా ఎందుకు చర్యలు తీసుకోరు?’ అని ప్రశ్నించారు.


