
సాక్షి, తాడేపల్లి: హైకోర్టు హెచ్చరించినా పోలీసులు తీరు మారడం లేదు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ నిర్బంధాలు కొనసాగుతున్నాయి. సవీంద్ర కేసులో పోలీసుల వైఖరిని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. హైకోర్టు ఆదేశాలతో సవీంద్ర విడుదలయ్యారు. అయితే, అదే సమయంలో మరో సోషల్ మీడియా యాక్టివిస్టు తారక్ ప్రతాప్‌రెడ్డిని నిర్బంధించారు.
తారక్‌ను ఎక్కడకు తీసుకెళ్లారో తెలియక కుటుంబ సభ్యుల ఆందోళన చెందుతున్నారు. మరో సోషల్ మీడియా యాక్టివిస్ట్ సాయిభార్గవ్‌పై అనంతపురం జిల్లా పోలీసుల ఓవరాక్షన్ చేశారు. ఇంటి నుండి బలవంతంగా రాప్తాడు పీఎస్‌కు తరలించారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసుల వేధింపులు కొనసాగుతున్నాయి. మూడు రోజుల్లోనే ముగ్గురు సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా నిర్బంధించారు.