
సాక్షి,అనంతపురం:తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. జేసీ ప్రభాకర్ రెడ్డికి అనంతపురం ఎస్పీ జగదీష్ అపాయింట్మెంట్ నిరాకరించారు. ఐపీఎస్ అధికారి తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జగదీష్ ప్రకటించారు. ఈ క్రమంలో తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు ఎస్పీ కార్యాలయానికి జేసీ ప్రభాకర్‌రెడ్డి వచ్చారు. గంట సేపు వేచి ఉన్నా జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎస్పీ జగదీష్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో చేసేది లేక ఇంటికి తిరిగి వెళ్లారు.