
సాక్షి, అనంతపురం: సూపర్‌సిక్స్-సూపర్‌హిట్’ పేరుతో తె.దే.పా-జనసేన-బీజేపీ కలిసి అనంతపురంలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేశాయి. అయితే ఈ సభలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, టీడీపీ శ్రేణులకు చేదు అనుభవం ఎదురైంది.
చంద్రబాబు ప్రసంగిస్తున్న టైంలోనే జనాలు అక్కడి నుంచి వెళ్లిపోతూ కనిపించారు. వాళ్లను ఆపేందుకు తె.దే.పా కేడర్, పోలీసులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో.. ఎదురుగా చంద్రబాబు మాట్లాడుతున్న టైంలోనూ ఇవతల ఖాళీ కుర్చీలే అక్కడ దర్శనమిచ్చాయి.



