‘రాజధాని అమరావతి ఓ భ్రమ’ | Professor Ramachandraya Critical Insights On Amaravati, Warns Of Huge Financial Impact | Sakshi
Sakshi News home page

‘రాజధాని అమరావతి ఓ భ్రమ’

May 2 2026 3:32 PM | Updated on May 2 2026 4:35 PM

Professor  Ramachandraiahs Critical Insights on Amaravati

అనంతపురం: రాజధాని అమరావతి  ఓ భ్రమ అని ప్రొఫెసర్‌, ఆర్థిక విశ్లేషకులు సి.రామచంద్రయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. వేల కోట్ల రూపాయలు అప్పులు చేయడం కోసమే అమరావతి పేరుతో  రాజధాని ఎపిసోడ్‌ను తీసుకొచ్చారన్నారు. అనంతపురంలో జరిగిన ఓ సదస్సులో  ప్రొఫెసర్‌ సి. రామచంద్రయ్య ప్రసంగిస్తూ.. రాజధాని అమరావతి అనేది భ్రమ తప్పితే ఏమీ లేదన్నారు. 

‘తాత్కాలిక నిర్మాణాల పేరిట వందల కోట్లు వృథా చేశారు. 2014-19 మధ్య 33 వేల ఎకరాలతోనే సింగపూర్‌ తరహా రాజధాని చేస్తానన్నారు. ఇప్పుడు 33 ఎకరాలు ఉంటే మున్సిపాలిటీ అంటున్నారు. మరో 50 వేల ఎకరాలు కావాలంటూ రైతులకు ద్రోహం చేస్తున్నారు. అమరావతి నిర్ణయాలు రాష్ట్రంపై తీవ్రమైన ఆర్థిక ప్రభావం చూపే అవకాశం ఉంది’ అని హెచ్చరించారు. 

నీ అబ్బా సొత్తా అమరావతి.. అమరావతికి నేను వ్యతిరేకినే..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement