అనంతపురం సెంట్రల్: రాప్తాడు మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన మల్లికార్జున కుమార్తె భవాని (19) ఆత్మహత్య చేసుకుంది. అనంతపురంలోని అశోక్ నగర్‌లో ఉన్న ప్రైవేట్ బాలికల హాస్టల్‌లో ఉంటూ నగరంలోని ఓ ప్రైవేటు లా కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్న ఆమె మంగళవారం సాయంత్రం తన గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సహచర విద్యారి్థనులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. భవాని మృతదేహాన్ని జీజీహెచ్‌లోని మార్చురీకి తరలించారు. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణంగా పోలీసుల ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వన్‌టౌన్ పీఎస్ ఎస్‌ఐ లక్ష్మణరావు తెలిపారు.


