అనంతపురం : గూగూడు కుళ్లాయి స్వామి (Gugudu Kullai Swamy) ఉత్సవాల్లో భాగంగా గురువారం చిన్న సరిగెత్తు ఘనంగా నిర్వహించారు.
ప్రత్యేకంగా అలంకరించిన పీర్లను భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. స్వామివారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. నామస్మరణతో మార్మోగించారు.
చిన్న సరిగెత్తులో భాగంగా జంట ఆలయంలోని ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామిని దర్శించుకున్న భక్తులు పరవశించి పోయారు. గూగూడు కుళ్లాయిస్వామికి శుక్రవారం పెద్దసరిగెత్తు, శనివారం సాయంత్రం అగ్ని గుండ ప్రవేశం అనంతరం జలధి నిర్వహించనున్నారు.


