
అనంతపురం జిల్లా: రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు మృతి చెందారనే విషయం తెలియని నాలుగేళ్ల బాలుడు తనకు మమ్మీ.. డాడీ కావాలంటూ రోదిస్తుండడంతో వైద్య సిబ్బందితో పాటు రోగులూ కన్నీటి పర్యంతమవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 4న విడపనకల్లు వద్ద రెండు కార్లు ఢీకొన్న విషయం తెలిసిందే.
ఘటనలో పెనుకొండ సమీపంలోని కియా పరిశ్రమలో సీనియర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న విశాఖనగరానికి చెందిన రామ్‌సుధీర్ భార్య లావణ్య అక్కడికక్కడే మృతి చెందగా, అనంతపురంలోని జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ రామ్‌సుధీర్ సైతం మృతిచెందాడు. వీరి కుమారుడు ఆద్విక్ కాలు విరిగి జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. అంతటి నొప్పిలోనూ తన తల్లిదండ్రుల కోసం చిన్నారి పరితపిస్తూ రోదిస్తున్నాడు. చిన్నారి రోదన చూసిన వారి హృదయాలు బరువెక్కిపోతున్నాయి.