దళపతి విజయ్ నటించిన 'జన నాయగన్ మూవీ విడుదలకు ముందే లీక్ కావడంతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పుడు రజనీకాంత్ జైలర్-2 మూవీ నుంచి కొన్ని సీన్లు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో చిత్ర యూనిట్ దిగ్భ్రాంతి చెందుతుంది. వైరల్ అవుతున్న ఈ క్లిప్‌ను ప్రచారం చేయవద్దని చిత్ర నిర్మాతలు ఒక ప్రకటన ద్వారా ప్రేక్షకులను కోరారు.
జైలర్ సినిమాకు సీక్వెల్‌గా పార్ట్-2ను దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.. అత్యంత భారీ బడ్జెట్‌తో కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. త్వరలో విడుదల కావాల్సిన ఈ మూవీ నుంచి కీలకమైన ఫుటేజ్ లీక్ అయింది. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. దయచేసి మూవీ సెట్స్ నుంచి లీక్ అయిన వీడియోను ఎవరూ షేర్ చేయవద్దని కోరింది. తమ పైరసీ నిరోధక టీమ్ ఈ అంశంపై చురుకుగా పర్యవేక్షిస్తోందని పేర్కొంది. ఎవరైనా వీడియోను షేర్ చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది.


