సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్-2 సినిమాకు తెలుగు హక్కుల ధరను రూ.60 కోట్లుగా మేకర్స్ నిర్ణయించారు. జైలర్ చిత్రం తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. దాంతో దాని సీక్వెల్‌కు తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్ల నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ రేటు ఫిక్స్ చేసినట్లు సమాచారం.
జైలర్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 70 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఆ విజయాన్ని బట్టి సీక్వెల్‌కు భారీ రేట్లు చెప్పడం సహజమేనని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అయితే జైలర్‌కు ముందు, ఆ తర్వాత రజనీకాంత్‌కు తెలుగులో పెద్ద విజయాలు లేకపోవడం గమనార్హం.
రజనీకాంత్ నటించిన 'కూలి' చిత్రం తెలుగు రైట్స్ రూ.52 కోట్లకు (జీఎస్టీతో కలిపి) అమ్ముడయ్యాయి. వేట్టయాన్ సినిమాకు మంచి ఓపెనింగ్ వచ్చాయి. కానీ పెద్దగా కలెక్షన్లు మాత్రం రాలేదు. ఈ లెక్కలన్నీ పరిశీలించి జైలర్-2కు రూ.60 కోట్ల రేటు ఫిక్స్ చేశారు. దాంతో జైలర్-2కు ఇంత మొత్తానికి బిజినెస్ జరుగుతుందా అనే చర్చ మొదలైంది.
జూన్ 12న థియేటర్లలోకి రానున్న జైలర్-2కు ముందు రామ్ చరణ్ 'పెద్ది' సినిమా విడుదల కానుంది. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ అయితే జైలర్-2కు థియేటర్లు దొరకడం కష్టమవుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అందువల్ల చివరి రేటు అప్పటి పరిస్థితులపై ఆధారపడి ఉండే అవకాశం ఉంది.
తమిళ దర్శకుడు నెల్సన్ తెరకెక్కిస్తున్న ఈ సీక్వెల్‌లో విగ్రహాల స్మగ్లింగ్ చేసే సిండికేట్‌కు ఎదురెళ్లే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్‌గా రజనీకాంత్ కనిపించనున్నారు. ఈ కథలో ఎస్‌జే సూర్య కొత్త విలన్‌గా పరిచయం కానున్నారు.


