జైలర్-2 రిలీజ్ డేట్ ఫిక్స్.. విశ్వంభరకు పోటీ తప్పదా? | Rajinikanth jailer 2 Release Date announced officially | Sakshi
Sakshi News home page

Jailer 2 Release Date : జైలర్-2 రిలీజ్ డేట్ ఫిక్స్.. విశ్వంభరకు పోటీ తప్పదా?

Jul 2 2026 6:50 PM | Updated on Jul 2 2026 7:15 PM

Rajinikanth jailer 2 Release Date announced officially

తలైవా, సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ జైలర్-2. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన జైలర్‌ మూవీ సీక్వెల్‌గా తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని మేకర్స్ ప్రకటించారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ మూవీ రానుంది.  తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ కూడా అనౌన్స్ చేశారు.

ఈ ఏడాది దసరా కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సన్ పిక్చర్స్ ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుందని వెల్లడించింది. దీంతో తలైవా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రంలో మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, రమ్యకృష్ణ  కీలక పాత్రలు పోషిస్తున్నారు.

విశ్వంభరతో పోటీ?

అయితే మెగాస్టార్ విశ్వంభర కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయినప్పటికీ పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. సమ్మర్‌లో రిలీజవుతుందని ఆశించినప్పటికీ అలా ఏం జరగలేదు.  ఈ దసరాకే విశ్వంభర రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు మేకర్స్ ప్రకటించకపోయినా.. దసరాకు రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 16న మెగాస్టార్ మూవీని విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారని టాలీవుడ్ టాక్. తాజాగా అక్టోబర్ 15న జైలర్-2 తేదీని ఫిక్స్ చేయడంతో విశ్వంభర రిలీజ్‌కు సాహసం చేస్తారా? మరోసారి వాయిదా వేయకతప్పదా? రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది.  జైలర్‌-2తో మెగాస్టార్ పోటీకి దిగుతాడా లేదా అన్నది త్వరలోనే తెలుస్తుంది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement