స్పెషల్‌ గెస్ట్‌..? | Hrithik Roshan is set to play a key cameo in Rajinikanth Jailer 2 | Sakshi
Sakshi News home page

స్పెషల్‌ గెస్ట్‌..?

Jun 12 2026 12:27 AM | Updated on Jun 12 2026 12:27 AM

Hrithik Roshan is set to play a key cameo in Rajinikanth Jailer 2

ముత్తువేల్‌ పాండియన్‌తో చేతులు కలపనున్నారట హృతిక్‌ రోషన్‌. రిటైర్డ్‌ పోలీస్‌ ఆఫీసర్‌ ముత్తువేల్‌ పాండియన్‌ పాత్రలో రజనీకాంత్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జైలర్‌’. 2023లో విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం రజనీ, నెల్సన్‌ల కాంబినేషన్‌లోనే ‘జైలర్‌’కు సీక్వెల్‌గా ‘జైలర్‌ 2’ తెరకెక్కుతోంది.

ఈ సినిమాలోని ఓ స్పెషల్‌ గెస్ట్‌ రోల్‌ను హృతిక్‌ రోషన్‌ చేయనున్నారని తెలిసింది. ఈ నెల 22, 23 తేదీల్లో ఈ సినిమా చిత్రీకరణ కోసం హృతిక్‌ రోషన్‌ చెన్నై చేరుకుంటారని, రజనీ–హృతిక్‌ కాంబినేషన్‌లోని కీలక సన్నివేశాలను నెల్సన్‌ చిత్రీకరిస్తారని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement