పవన్ కల్యాణ్.. ఏ మాత్రం నమ్మలేని రూమర్! | Pawan Kalyan Consider Jailer 2 Movie Cameo | Sakshi
Sakshi News home page

Pawan Kalyan: షారూఖ్ బదులు పవన్ కల్యాణా?

Apr 11 2026 5:10 AM | Updated on Apr 11 2026 5:19 AM

Pawan Kalyan Consider Jailer 2 Movie Cameo

పవన్ కల్యాణ్‌కి ప్రస్తుతం సినిమాలు చేయడంపై పెద్దగా ఆసక్తి ఉన్నట్లయితే కనిపించట్లేదు. ఎందుకంటే కొన్నిరోజుల క్రితమే ఈయన నిర్మాణ సంస్థ నుంచి ఓ ప్రకటన వచ్చింది. కొత్తగా ఏ మూవీస్ ఒప్పుకోలేదని, ఒకవేళ కొత్త ప్రాజెక్టులు అంగీకరిస్తే ఆయన వెల్లడిస్తారనేది సదరు పోస్ట్ సారాంశం. దీంతో పవన్ ఇప్పట్లో కొత్తగా ఏం చేయరని చాలామందికి క్లారిటీ వచ్చేసింది. ఇంతలోనే ఓ రూమర్ వినిపిస్తోంది. 'జైలర్ 2'లో ఏకంగా అతిథి పాత్రలో కనిపిస్తారని కోలీవుడ్ మీడియాలో తెగ మాట్లాడుకుంటున్నారు.

(ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)

చూస్తుంటే ఈ రూమర్‌లో ఏ మాత్రం నిజం లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ తన సినిమాలకే సరిగా డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే ఆయనతో మూవీ అంటే అనుకున్న టైం కంటే చాలా ఆలస్యమైపోతుంటాయి. రీసెంట్‌గా చూసుకుంటే ఉ‍స్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరిహర వీరమల్లు.. ఏది తీసుకున్నా సరే పూర్తవడానికి ఏ‍ళ్లకు ఏళ్లు పట్టాయి. అలానే పవన్ ఇప్పటివరకు చిరంజీవి సినిమాల్లో తప్పితే వేరే వాటిలో అతిధి పాత్రలు చేయలేదు.

అలాంటిది 'జైలర్ 2'లో షారూఖ్ ఖాన్ చేయాల్సిన పాత్రని పవన్ చేస్తారని అనుకోవడం అస్సలు నమ్మేలా లేదు. రూమర్ అంటే కనీసం నమ్మేలా అయినా ఉండాలి. కానీ తమిళ మీడియాలో ఏ మాత్రం నమ్మశక్యం కాని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. గతంలో ఇదే మూవీలో క్యామియో కోసం హీరో బాలకృష్ణని కూడా సంప్రదించారని, కానీ వర్కౌట్ అవ్వలేదని టాక్ వినిపించింది. చూస్తుంటే 'జైలర్ 2'లో అతిథి పాత్రలు ఎవరు చేస్తారనే సస్పెన్స్ ఎన్నాళ్లు కొనసాగుతుందో ఏంటో?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మృణాల్ ఠాకుర్ రొమాంటిక్ సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement