ఓటీటీలోకి మృణాల్ ఠాకుర్ రొమాంటిక్ సినిమా | Do Deewane Seher Mein Movie OTT Release Date Update | Sakshi
Sakshi News home page

OTT: మృణాల్ కొత్త మూవీ.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Apr 11 2026 1:28 AM | Updated on Apr 11 2026 1:28 AM

Do Deewane Seher Mein Movie OTT Release Date Update

ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అలానే మృణాల్ ఠాకుర్ నటించిన ఓ రొమాంటిక్ డ్రామా ఇప్పుడు స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ఓవైపు ఈమె నటించిన 'డెకాయిట్' చిత్రం థియేటర్లలోకి రాగా ఇప్పుడు మృణాల్ కొత్త మూవీ ఒకటి డిజిటల్ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులోకి రానుంది?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అది డోంట్ మిస్)

సీతారామం, హాయ్ నాన్న తదితర సినిమాలతో తెలుగులోనూ బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న మృణాల్.. స్వతహాగా ముంబైకి చెందిన నటి. విజయ్ దేవరకొండతో చేసిన 'ఫ్యామిలీ స్టార్' ఫ్లాప్ అయ్యేసరికి ఎక్కువ ఫోకస్ హిందీ మూవీస్‌పై పెట్టింది. అలా సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి సినిమానే 'దో దివానే షెహర్ మే'. ఫిబ్రవరిలో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ఓ మాదిరిగా మెప్పించింది. ఇప్పుడిది రాబోయే శుక్రవారం (ఏప్రిల్ 17) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

దో దివానే షెహర్ మే సినిమా విషయానికొస్తే.. శ అనే అక్షరం సరిగా పలకడం రాని శశాంక్ (సిద్ధాంత్ చతుర్వేది) ఓ కంపెనీలో పనిచేస్తుంటాడు. మరోవైపు పెద్దపెద్ద కళ్లద్దాలు పెట్టుకుని తానేం అందంగా లేనని భావించే రోష్ని(మృణాల్ ఠాకుర్).. పెద్దల కుదిర్చిన పెళ్లిచూపుల ద్వారా కలుసుకుంటారు. మొదట శశాంక్‌ని రిజెక్ట్ చేసిన రోష్ని తర్వాత అతడితోనే ఎలా ప్రేమలో పడింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

ప్రస్తుత జెన్-జీ జనరేషన్‌కి తగ్గట్లుగా తీసిన ఈ సినిమాలో స్టోరీ బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లేలో లోపాల కారణంగా ఓకే ఓకే అనిపించుకుంది. అయితే ఓటీటీలో హిందీలో మాత్రమే అందుబాటులోకి రానుంది.

(ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)

Advertisement
 
Advertisement
Advertisement