Prakash Raj Says I Decided to Die After Son Sidhu Death Incident Went Viral - Sakshi
Sakshi News home page

Prakash Raj-Sidhu Death: అప్పుడు ఈ ప్రపంచమే వద్దనిపించింది.. ప్రకాశ్‌రాజ్‌ కామెంట్స్‌ వైరల్‌

Mar 27 2022 1:50 PM | Updated on Mar 27 2022 3:20 PM

Prakash Raj Says I Decided to Die After Son Death Incident - Sakshi

విడిపోయిన తర్వాత నాకు మళ్లీ పెళ్లి చేసుకోవాలనిపించింది. ఇదే విషయాన్ని నా తల్లికి, ఇద్దరు కూతుళ్లకు చెప్తే మంచి నిర్ణయమన్నారు. ఆ తర్వాత పోనీ వర్మ వాళ్ల ఇంటికి వెళ్లి మాట్లాడాను. నా

విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ మంచితనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎన్నో సహాయకార్యక్రమాలు చేసి ఎందరో జీవితాల్లో వెలుగు నింపారాయన. మానవత్వం, దయాగుణానికి నిలువెత్తు రూపంలా ఉండే ప్రకాశ్‌ రాజ్‌ ఇండస్ట్రీలో ఇప్పటికీ తన హవా చూపిస్తున్నాడు. సినిమాల్లో ఎన్నో విజయాలను చూసిన ఆయన వ్యక్తిగతంగా మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. మొదటి భార్య లలితకుమారికి విడాకులు ఇచ్చి ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల ప్రకాశ్‌రాజ్‌ ఈ విడాకుల విషయంపై స్పందించాడు.

నిన్న (మార్చి 26న) ప్రకాశ్‌ రాజ్‌ బర్త్‌డే సందర్భంగా ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇందులో ఆయన ఏమన్నాడంటే.. 'మొదటి భార్య లలితకుమారితో విబేధాలు రావడంతో విడాకులు తీసుకున్నాను. కానీ నా పిల్లలు ఆమెతో కలిసే ఉంటున్నారు. విడిపోయిన తర్వాత నాకు మళ్లీ పెళ్లి చేసుకోవాలనిపించింది. ఇదే విషయాన్ని నా తల్లికి, ఇద్దరు కూతుళ్లకు చెప్తే మంచి నిర్ణయమన్నారు. ఆ తర్వాత పోనీ వర్మ వాళ్ల ఇంటికి వెళ్లి మాట్లాడాను. నాకు, మీ కూతురికి 12 ఏళ్ల వ్యత్యాసం ఉంది. మీ అందరూ నా కుటుంబంగా ఏర్పడాలనుందని చెప్పి ఒప్పించాను. మాకు పెళ్లైంది, కొడుకు పుట్టాడు. అతడికి ఐదేళ్ల వయసున్నప్పుడు రిసార్ట్‌లో గాలిపటం ఎగరేస్తూ కిందపడ్డాడు. అప్పుడు తలకు పెద్ద దెబ్బ తగిలింది. ఎంత కష్టపడ్డా అతడిని బతికించుకోలేకపోయాం. ఆ సమయంలో ఈ ప్రపంచమే వద్దనిపించింది. కానీ పదిమంది కోసమైనా బతకాలి కదా! ఆ తర్వాత నాకింకో బాబు పుట్టాడు, సంతోషంగా ఉన్నాను' అని చెప్పుకొచ్చాడు ప్రకాశ్‌ రాజ్‌.

చదవండి: ఇకపై ఆ బాధ్యత నాదే.. ప్రకాశ్‌ రాజ్‌ కీలక ప్రకటన

 ట్విటర్‌లో ఫ్యాన్స్‌ వార్‌, స్టార్‌ హీరో చనిపోయాడంటూ ట్రోలింగ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement