మరో డర్టీ పిక్చర్... ఈ సారి సిల్క్ స్మిత స్టోరీ కాదు..! | The Dirty Picture 2 Announced After 15 Years, Ekta Kapoor Reveals Sequel Details And Raises Questions About Lead Actress | Sakshi
Sakshi News home page

Dirty Picture 2 Movie: ది డర్టీ పిక్చర్ సీక్వెల్... ఈ సారి సిల్క్ స్మిత స్టోరీ కాదు..!

Oct 12 2026 9:04 AM | Updated on Oct 12 2026 9:49 AM

Ektaa Kapoor confirms The Dirty Picture 2 Movie

బాలీవుడ్ భామ విద్యాబాలన్ నటించిన సూపర్ హిట్ అండ్ బోల్డ్ మూవీ ది డర్టీ పిక్చర్. ఈ మూవీ ఆమె కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 2011లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రాని టాలీవుడ్ నటి సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కించారు. 

తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌ రానుందని నిర్మాత ఏక్తా కపూర్ ప్రకటించారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ మూవీ సీక్వెల్‌ను అనౌన్స్ చేయడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. గతంలో రిలీజైన ది డర్టీ పిక్చర్ సినిమాలో సిల్క్ స్మిత జీవితంతో ప్రేరణ పొందిన కథ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈసారి లీడ్‌ రోల్ ఎవరు చేస్తారనే విషయాన్ని వెల్లడించలేదు. విద్యాబాలన్ ఈ పాత్రను మరోసారి చేస్తుందా? లేదంటే కొత్త వారిని తీసుకుంటారా? అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ మూవీ కూడా ఒక వ్యక్తి జీవితం చుట్టూనే తిరుగుతుందని ఏక్తా కపూర్ తెలిపింది. కానీ అయితే ఆ వ్యక్తి ఎవరో మాత్రం ఆమె వెల్లడించలేదు.

ఏక్తా కపూర్ మాట్లాడుతూ..'నేను చేస్తున్న చాలా పెద్ద సినిమాలలో 'ది డర్టీ పిక్చర్ 2'ఒకటి.  దాదాపు 15 సంవత్సరాల తర్వాత  ప్లాన్ చేస్తున్నా. 'ది డర్టీ పిక్చర్' సిల్క్ స్మిత జీవితంపై తీశాం. నేను ఆమెను ఎప్పుడూ బాధితురాలిగా చూడలేదు. నేను ఆమెను తన లైంగికతను ఆస్వాదించే వ్యక్తిగా చూశా. అందుకే ఆ సినిమా చాలా బాగా ఆడింది." అని అన్నారు. కాగా.. ది డర్టీ పిక్చర్' చిత్రంలో విద్యా బాలన్, నసీరుద్దీన్ షా, ఇమ్రాన్ హష్మీ, తుషార్ కపూర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో తన నటనకు గాను విద్యా బాలన్ ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకున్నారు.

కాగా.. టాలీవుడ్ నటి, ఐటమ్ సాంగ్స్ ఫేమ్ సిల్క్ స్మిత తన 18 ఏళ్ల కెరీర్‌లో 450కి పైగా చిత్రాలలో నటించారు. ఆమె 35 ఏళ్ల వయసులో చెన్నైలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని మరణించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement