బిగ్‌బీ బర్త్‌డే.. అభిమానికి తీవ్ర నిరాశ..! | Amitabh Bachchan Faces Online Backlash After Ignoring Female Fan Handshake Request During Birthday, Watch Video Goes Viral | Sakshi
Sakshi News home page

Amitabh Bachchan: ఎన్నో ఆశలతో వచ్చిన అభిమాని.. బిగ్‌బీ తీరుతో నిరాశ..!

Oct 12 2026 12:52 PM | Updated on Oct 12 2026 1:11 PM

Amitabh Bachchan declined fans handshake on birthday

బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ తన బర్త్ డే సందర్భంగా అభిమానులకు అభివాదం చేశారు. తన ఇంటి బయట నిలబడి ఫ్యాన్స్‌కు నమస్కరించాడు. ఆదివారం తన పుట్టినరోజు కావడంతో ఎప్పటిలాగే ఫ్యాన్స్‌కు పలకరించేందుకు వచ్చారు. అయితే అదే సమయంలో ఓ మహిళ అభిమాని అమితాబ్‌తో కరచాలనం చేసేందుకు యత్నించింది. కానీ అమితాబ్‌ ఆమెను పట్టించుకోలేదు. దీనికి సంబంధించిన వీడియో  సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఇది చూసిన నెటిజన్స్ సోషల్ మీడియాలో భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో ఆ అభిమాని అభ్యర్థనను మన్నించి కరచాలనం చేయాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఆయన వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని సూచిస్తున్నారు. ఆ అభిమాని ఎన్నో ఆశలతో అమితాబ్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు వస్తే నిరాశపరిచిడాని ఓ నెటిజన్స్ రాసుకొచ్చారు. ఆమెతో చేయి కలిపితే ఏం జరుగుతుంది? మరో నెటిజన్స్ ప్రశ్నించాడు. ఒకరు ఆయన అలా చేయాల్సిన అవసరం లేదనగా..ఈ మనుషులకు ఏమైంది? ఆయన కూడా ఒక మనిషే కదా అని మరో నెటిజన్‌ అన్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే అమితాబ్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్‌లో అశ్వత్థామ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ నటిస్తున్నారు. ఇటీవలే అమితాబ్‌ కల్కి-2 షూటింగ్‌లో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement