అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘రాకా’. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఎంట్రీ సీక్వెన్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండనుందని తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ కోసం బన్నీ రిస్కీ యాక్షన్ స్టంట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారని లేటేస్ట్ టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా బన్నీ లుక్స్ కూడా చాలా స్పెషల్‌గా ఉండనున్నాయని టాక్. అయితే ఇది రూమరా? రియలా తెలియాలంటే మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
కాగా.. ఈ సినిమాలో దీపికతో పాటు మృణాల్ ఠాకూర్ కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. అంతేకాకుండా జాన్వీ కపూర్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మాఫియా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.


