Prakash Raj-KCR: ఫాంహౌస్‌లో సీఎం కేసీఆర్‌తో ప్రకాశ్‌ రాజ్‌ భేటీ!

Prakash Raj Meets Telangana CM KCR - Sakshi

Prakash Raj Meets Telangana CM KCR: సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ శనివారం మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ను సందర్శించారు. అలాగే గజ్వేల్‌ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌ అండ్‌ నాన్‌ వెజ్‌ మార్కెట్‌ను కూడా ఆయన పరిశీలించారు. దేశంలోనే ఎక్కడాలేని విధంగా ఒకేచోట అన్ని నిత్యావసరాలు దొరికేలా విశాలమైనమార్కెట్‌ను నిర్మించడం అభినందనీయమని కొనియాడారు. వ్యవసాయ మార్కెట్‌కు సంబంధించిన అంశాలను చైర్‌పర్సన్‌ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు.

ఆ తర్వాత మహతి ఆడిటోరియం, ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలను సందర్శించారు. అంతకుముందు మల్లన్న సాగర్‌ ప్రాజెక్ట్‌ వద్దకు వెళ్లి అక్కడ పంప్‌హౌస్, కట్టను పరిశీలించారు. ప్రకాశ్‌రాజ్‌ శుక్రవారం సాయంత్రం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని సీఎం వ్యవసాయ క్షేత్రంలో ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. సాయంత్రం అక్కడే బస చేసి ఉదయం మల్లన్న సాగర్‌ను సందర్శించారు. శనివారం సాయంత్రం మళ్లీ ఫాంహౌస్‌కు వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top