ఆయన నటనలోని మ్యాజిక్‌ని చూశా: ప్రకాశ్‌రాజ్‌  | Prakash Raj Interesting Comments On Brahmanandam in Rangamarthanda Event | Sakshi
Sakshi News home page

Prakash Raj: ఆయన నటనలోని మ్యాజిక్‌ని చూశా: ప్రకాశ్‌రాజ్‌ 

Mar 22 2023 9:33 AM | Updated on Mar 22 2023 9:33 AM

Prakash Raj Interesting Comments On Brahmanandam in Rangamarthanda Event - Sakshi

ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన ΄ాత్రల్లో నటించిన చిత్రం ‘రంగ మార్తాండ’. కృష్ణవంశీ దర్శకత్వంలో కాలిపు మధు, ఎస్‌. వెంకట్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రకాశ్‌రాజ్‌ మాట్లాడుతూ.. ‘‘మరాఠీ ‘నటసామ్రాట్‌’ సినిమా చూశాక ఒక కళాకారుడి జీవితంలో ఉన్న బరువు నాకు అర్థం అయింది. ఇలాంటి కథను నేను చూపించాలని అనుకున్నాను. ‘నటసామ్రాట్‌’ గురించి కృష్ణవంశీకి చెప్పగానే బాగుందన్నాడు.

ఎమోషన్స్‌ చక్కగా ప్రెజెంట్‌ చేయగలడని తనని ఈ సినిమా రీమేక్‌ ‘రంగ మార్తాండ’కు దర్శకత్వం వహించమని కోరాను. బ్రహ్మానందంగారితో కలిసి వర్క్‌ చేయడం వల్ల ఆయన నటనలోని మ్యాజిక్‌ను చూసే అవకాశం దొరికింది’’ అన్నారు. ‘‘ప్రకాశ్‌రాజ్‌ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారు. ఎన్నో సినిమాల్లో నటించిన అనుభవం ఉన్న అద్భుత నటులు బ్రహ్మానందం ఈ సినిమా కోసం కొత్త ఆర్టిస్టులా నటించారు’’ అన్నారు కృష్ణవంశీ. ‘ఈ చిత్రం క్లయిమాక్స్‌లో ప్రకాశ్‌రాజ్‌ నట విశ్వరూపం చూస్తారు. ప్రతి సీన్‌ని కృష్ణవంశీ చక్కగా తెరకెక్కించారు’’ అన్నారు బ్రహ్మానందం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement